: హోండురాస్ బ్యూటీ క్వీన్ కనిపించుటలేదు.... సోదరి సహా అదృశ్యం!


మిస్ హోండురాస్ 2014 టైటిల్ విజేత మరియా జోస్ అల్వరాడో కనిపించడం లేదని అందాల పోటీ ఆర్గనైజర్ ఎడ్యుయార్డో జబ్లా తెలిపారు. వారం నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదని చెప్పారు. పశ్చిమ హోండురాస్ లోని శాంటా బార్బరాలో మరియా తన సోదరితో కలిసి ఓ బర్త్ డే పార్టీకి హాజరైందని, అప్పటి నుంచి వారిద్దరు ఎక్కడ ఉన్నదీ తెలియడంలేదని జబ్లా వివరించారు. శనివారం వరకు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కాగా, ఈ ఏడాది మిస్ హోండురాస్ వరల్డ్ గా ఎంపికైన మరియా, వచ్చే నెల లండన్ లో జరిగే మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో పాల్గొనాల్సి ఉంది.

  • Loading...

More Telugu News