: ముద్గల్ కమిటీ ముందు భోరున విలపించిన బౌలర్, ఆల్ రౌండర్!


ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై నియమితమైన ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఐసీసీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ముద్గల్ కమిటీ, ఫిక్సింగ్ స్కాంలో ఓ బౌలర్, ఆల్ రౌండర్ పాత్రపై పలు వివరాలను పేర్కొంది. ఈ ఇద్దరు క్రికెటర్లలో ఒకరు వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడని, మరొకరు ప్రముఖ ఫాస్ట్ బౌలర్ అని సమాచారం. జస్టిస్ ముద్గల్ కమిటీ వీరిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా, ఆ ఇద్దరూ భోరున ఏడ్చేశారట. నివేదికలో తమ పేర్లు పొందుపరిస్తే తమ జీవితం నాశనమవుతుందని వేడుకున్నారట. ఇప్పటికే తమ కెరీర్ చరమాంకంలో ఉందని, రిటైర్మెంటు అనంతరం గౌరవంగా బతకాలనుకుంటున్నట్టు చెప్పారట ఆ క్రికెటర్లిద్దరూ. ముఖ్యంగా, ఓ క్రికెటర్ బాధపడిన తీరు కమిటీ సభ్యులను దిగ్భ్రమకు గురిచేసినట్టు తెలుస్తోంది. కాగా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలున్నాయని ముద్గల్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News