: రైనా కూడా ఓ జట్టుకు సహ యజమాని అయ్యాడు!
క్రికెటర్లు ఇతర క్రీడల లీగ్ పోటీల్లో ఫ్రాంచైజీలు సొంతం చేసుకోవడం పరిపాటిగా మారింది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ సాకర్ టోర్నీ ఫ్రాంచైజీల్లో వాటాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, విధ్వంసక బ్యాట్స్ మన్ సురేశ్ రైనా ఫుట్ బాల్ కాకుండా హాకీ లీగ్ లో కాలుమోపాడు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ కు రైనా సహ యజమాని అయ్యాడు. ఈ విషయాన్ని 'విజార్డ్స్' యజమాని అభిజిత్ సర్కార్ తెలిపారు. హాకీ లీగ్ లో భాగస్వామి కావడం పట్ల రైనా ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తో చేతులు కలపడం సంతోషాన్నిస్తోందన్నాడు.