: లౌకికవాదాన్ని అడ్డుకునేవారితో కడదాకా పోరాడతా: సోనియా
జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, లౌకికవాద వ్యతిరేక శక్తులతో తుది వరకు పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవించడమే లౌకిక వాదమని, దాన్ని అడ్డుకునే వారు ఎంతటివారైనా సరే ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని ఉద్ఘాటించారు. నెహ్రూ నమ్మిన సిధ్ధాంతాల్లో లౌకికవాదం ఒకటని సోనియా ఈ సందర్భంగా తెలిపారు.