: మేమిచ్చిన ల్యాప్ టాపుల్లో మోడీ ప్రసంగాలు చూశారు: ములాయం ఆవేదన


సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము పంపిణీ చేసిన ల్యాప్ టాప్ లు తమ కొంప ముంచాయంటున్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్. తమ అభ్యర్థుల ఓటమికి అవే కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పంపిణీ చేసిన ల్యాప్ టాపుల్లో ప్రజలు మోదీ ప్రసంగాలు చూసి ఉత్తేజితులయ్యారని ములాయం వివరించారు. మోదీ మాటలకు ప్రభావితులైన ఓటర్లు ఆయనకే పట్టం కట్టారని, తాము ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అసలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించేవాడినని ఈ సీనియర్ పొలిటీషియన్ తెలిపారు. 2012 ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్ లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గడిచిన రెండేళ్లలో 27 లక్షల ల్యాప్ టాప్ లను విద్యార్థులకు అందించారు.

  • Loading...

More Telugu News