: యాదగిరిగుట్టపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి... వాటికన్ సిటీలా చేస్తారట!


తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్నాడిక్కడ. ఈ క్షేత్రంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, యాదగిరిగుట్టను వాటికన్ సిటీలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గుట్టకు కూడా టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News