: బ్రిటీషోళ్లు ఐపాడ్ ను బాంబు అనుకుని హడలిపోయారు!


బ్రిటన్ పార్లమెంటులో బాంబు కలకలం రేగింది. పార్లమెంటు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో బాంబు భయం నెలకొంది. దీంతో, పార్లమెంటును ఖాళీ చేయించారు. ఎంపీలను వెలుపలికి పంపారు. చివరికా వస్తువు ఓ ఐపాడ్ అని తేలింది. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఐపాడ్ మంత్రి నిక్ బోల్స్ అనుచరుడిదిగా గుర్తించారు. ఆ అనుచరుడు పార్లమెంటుకు రావడం అదే ప్రథమమట. కాగా, బాంబు భయంతో పార్లమెంటు ఎదురుగా ఉన్న ఆఫీసు భవంతిని, భూగర్భ రైల్వే స్టేషన్ ను కూడా ఖాళీ చేయించారు. దీనిపై మంత్రి నిక్ బోల్స్ ట్వీట్ చేశారు. "మా కుర్రాడి ఉద్యోగం పార్లమెంటులో తొలినాడే ఉద్విగ్నభరితంగా మొదలైంది. అతడి ఐపాడ్ కారణంగా పార్లమెంటు ఖాళీ అయింది" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News