: చిత్ర నిర్మాణం చేపడతానంటున్న మాధురీ దీక్షిత్
బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇంకా ఇతర యువ నటుల బాటలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్ చిత్ర నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలే తన ఆన్ లైన్ డ్యాన్స్ అకాడమీనీ పునరుద్ధరించింది ఈ అందాల తార. దాంతోపాటు, సినిమా నిర్మాణం కూడా చేస్తానని చెబుతోంది. "ఇప్పటికే అకాడమీ కోసం డిజిటల్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇది పూర్తయితే, ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి వస్తాను" అని మాధురి అంటోంది. అయితే, ఎలాంటి సినిమాలు నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారన్న ప్రశ్నకు బదులివ్వలేదు.