: ఫిక్సింగ్ స్కాంలో శ్రీనివాసన్ పాత్ర లేదు : ముద్గల్ కమిటీ రిపోర్ట్
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఐసీసీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని ఎన్.శ్రీనివాసన్ ప్రమేయం లేదని ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఒక హోటల్ లో బుకీని కలిసినట్టు తెలిపింది. అయితే, బెట్టింగ్ లో పాల్గొన్నాడని చెప్పేందుకు సాక్ష్యాలు లేవని వివరించింది. ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్, రాజస్తాన్ టీం సహా యజమాని రాజ్ కుంద్రాలు కూడా బుకీలతో టచ్ లో ఉండేవారని తమ దర్యాప్తులో వెల్లడైందని ముద్గల్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా, కేసు విచారణను ఈ నెల 24వ తేదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం ఆ రోజు అందరు నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.