: 'రౌడీ ఫెలో' ప్లాటినమ్ డిస్క్ వేడుకకు అనూహ్య స్పందన... ఆశ్చర్యపోయిన నిర్వాహకులు
యువ హీరో నారా రోహిత్, విశాఖ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రౌడీ ఫెలో'. ఈ సినిమా ఇటీవలే ఆడియో వేడుక జరుపుకుంది. పాటలు సూపర్ హిట్టవ్వడంతో విజయవాడలో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. హాయ్ లాండ్ రిసార్ట్స్ వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకకు 2000 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే, 5000 మంది రావడంతో వారు ఆశ్చర్యపోయారట. మరో 2000 మంది రిసార్ట్స్ వెలుపలే నిలిచిపోయారట. హైదరాబాదులో జరిగిన ఆడియో వేడుక హిట్టవ్వడం, తాజాగా విజయవాడలో జరిగిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కూడా విజయవంతం కావడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. మూవీ మిల్స్ అండ్ సినిమా 5 బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించాడు. సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించాడు.