: బాత్ రూంలు కూడా ఇష్టంగానే కట్టిస్తున్నా: మోదీ


ఒక దేశ ప్రధానిగా ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నాయా? లేవా? అని పరిశీలించాల్సి వస్తోందని, లేని చోట్ల వాటిని కట్టించాల్సి వస్తోందని, ఆ పనిని కూడా ఇష్టంగానే చేస్తున్నానని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సిడ్నీలో ఆయన మాట్లాడుతూ, ఇల్లు శుభ్రంగా ఉంటే గ్రామం, ఆపై రాష్ట్రం, తద్వారా దేశం బాగుంటాయని, 'స్వచ్ఛ భారత్' అంటే అదేనని అన్నారు. భారతీయులందరికీ బ్యాంకు ఖాతాలను తెరిపించాలంటే మూడేళ్లు పడుతుందని రిజర్వు బ్యాంకు అధికారులు చెప్పారని, కేవలం 6 రోజుల్లో 7 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించామని తెలిపారు. మరో 4 నెలల్లో లక్ష్యం చేరుకుంటామని ధీమాగా చెప్పారు.

  • Loading...

More Telugu News