: ఈ ఆరు నెలల్లో మీలో విశ్వాసాన్ని కలిగించాం: మోదీ
"ఇండియాలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచింది. ఈ ఆరు నెలల్లో ఏదో చేశామని నేను చెప్పబోవడం లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఏదో చేయగలమన్న నమ్మకాన్ని కలిగించాం" అని సిడ్నీ అల్ఫోన్స్ ఎరీనాలో దాదాపు 20 వేల మందిని ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. భారత్ ను 'యువ' దేశంగా అభివర్ణించిన ఆయన 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరంతా తలచుకుంటే ఏదైనా చేయగలరని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. సిడ్నీ ఎంతో అందమైన నగరమని కితాబు ఇచ్చారు.