: దేశం కోసం మరణించే అవకాశం రాలేదు... దేశం కోసం జీవించండి: సిడ్నీలో మోదీ


"దేశం కోసం మరణించే అవకాశాన్ని, జైళ్లలో గడిపే సమయాన్ని భారతమాత మనకివ్వలేదు. కానీ దేశం కోసం జీవించే అవకాశాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడున్నా భారత్ కోసం కృషి చేయాలి" అని వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సిడ్నీలో ప్రధాని బహిరంగ సభ మిన్నంటిన నినాదాల మధ్య సోమవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత పుట్టి ప్రధానిగా ఉన్న తొలి వ్యక్తిని తానేనని మోదీ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News