: రెండు బ్యాంకుల్లో చోరీ... 50 కిలోల బంగారం అపహరణ


వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకుకు చెందిన రెండు శాఖల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ప్రధాన ద్వారం తాళాలు వేసినవి వేసినట్టే ఉండగా, లాకర్లలోని బంగారు ఆభరణాలు మాయం అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. భూపాలపల్లి శాఖతో పాటు ఆజమ్ నగర్ లో అదే బ్యాంకు నిర్వహిస్తున్న మరో శాఖలోనూ దొంగతనం జరిగింది. మొత్తం 50 కిలోల బంగారం, 20 లక్షల నగదు చోరీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి విచారణ చేపట్టారు. తాళాలు ఉండగానే చోరీ జరగడం వెనుక బ్యాంకు సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Loading...

More Telugu News