: ఆస్కార్ లైబ్రరీకి 'హ్యాపీ న్యూ ఇయర్'
ఇప్పటికే రూ.350 కోట్లు వసూలుచేసి రికార్టు సృష్టించిన 'హ్యాపీ న్యూ ఇయర్' (హెచ్.ఎన్.వై) బాలీవుడ్ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ సినిమా త్వరలో ఆస్కార్ లైబ్రరీలో చేరనుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ లైబ్రరీ, సైన్సెస్ ఈ మేరకు అధికారికంగా 'హెచ్.ఎన్.వై' సినిమా స్క్రీన్ ప్లేను కీలక సేకరణలో భాగంగా ఎంచుకుంది. సినిమా రంగానికి చెందిన విద్యార్థులు, దర్శకులు, రచయితలు, నటుల పరిశోధన కోసం అత్యుత్తమ స్క్రీన్ ప్లే కలిగి వున్న చిత్రాలను ఈ లైబ్రరీలో భద్రపరుస్తారు. చాలా సంవత్సరాలుగా, ఈ సేకరణ మరింత పెరిగి కొన్ని స్క్రిప్టులు కూడా చేరాయి. షారుక్ ఖాన్, దీపికా పదుకొనె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించిన ఈ 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందింది.