: మోదీ నామస్మరణతో మారుమోగిన సిడ్నీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణతో ఆస్ట్రేలియా నగరం సిడ్నీ సోమవారం మారుమోగిపోయింది. మోదీ సభ ఏర్పాటు చేసిన అల్ఫోన్సో అరెనా వద్దనే కాక నగరవ్యాప్తంగా మోదీ మంత్రం మారుమోగింది. తమనుద్దేశించిన ప్రసంగించేందుకు వచ్చిన ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సిడ్నీ నగర పాలనా యంత్రాంగం కూడా పాలుపంచుకున్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రవాస భారతీయులు ఒక్కసారిగా మోదీ నినాదాలతో సభా వేదికను ముంచెత్తారు. ప్రధాని మాట్లాడిన ప్రతి మాటకు సభికుల నుంచి జయజయ ధ్వానాలు లభించాయి.