: కృష్ణా బోర్డు తీర్పుపై తెలంగాణ పిటిషన్ విచారణ డిసెంబర్ 1కి వాయిదా
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును పున:పరిశీలించాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ విచారణ డిసెంబర్ 1కి వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం ఈ విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సోమవారం నాటి విచారణ సందర్భంగా తెలంగాణ సర్కారు వాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. పదేళ్ల పాటు అన్ని రాష్ట్రాల వాదనలు విన్న తర్వాతే ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని, దీనిపై మళ్లీ పున:పరిశీలించాలని కోరడం విడ్డూరంగా ఉందని మహారాష్ట్ర తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది అన్నారు.