: తుది శ్వాస వరకూ శ్రీవారి సేవలోనే: డాలర్ శేషాద్రి
తన చివరి క్షణాల వరకు శ్రీవారి సేవలోనే గడుపుతానని డాలర్ శేషాద్రి అన్నారు. డాలర్ల కుంభకోణం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, ఎంతో మంది కుట్రలు పన్నినా న్యాయమే గెలిచిందని సోమవారం నాడు ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారి ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని శేషాద్రి అన్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు డాలర్లు మాయమైన కేసులో శేషాద్రి నిర్దోషని చిత్తూరు కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీటీడీ మాజీ షరాబు వెంకటాచలపతికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.