: సల్మాన్ సోదరి 'సంగీత్'లో షారుఖ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ వేడుక రేపు జరగనుంది. ఈ వివాహానికి వేదికగా నిలవనున్న హైదరాబాదులోని ఫలక్ నూమా ప్యాలెస్ ఇప్పటికే పెళ్లి శోభను సంతరించుకుంది. వివాహానికి ముందు ముంబైలో నిర్వహించిన సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హాజరయ్యాడు. అర్పిత తనకూ చెల్లెలేనని ప్రకటించిన షారుఖ్, సంగీత్ కు హాజరు కావడమే కాక, సల్మాన్ తో భుజం కలిపి మరీ ఫొటోలకు పోజిచ్చాడు. షారుఖ్ హాజరుతో సంతోషం వ్యక్తం చేసిన అర్పిత సదరు ఫొటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేసింది.