: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచిదే: సినీ నటుడు కృష్ణంరాజు
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మాజీ ఎంపీ, సినీ నటుడు కృష్ణంరాజు తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్నారు. గతంలో కంటే రాజకీయాల పట్ల రజనీ వైఖరి మారిందని, ఇప్పుడు భగవంతుడు ఆదేశిస్తే వస్తానంటున్నారని అన్నారు. రజనీ బీజేపీలో చేరితే తమిళనాడులోనే కాకుండా దక్షిణాది మొత్తం పార్టీ బలపడుతుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దుమ్ములపేటలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ లతో కలసి కృష్ణంరాజు పాల్గొన్నారు.