: ఓయూలో విద్యార్థుల రాళ్ల దాడి... పోలీసుల లాఠీచార్జి
ఉస్మానియా ప్రదాన ద్వారం ఎన్సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడితో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. అయినా విద్యార్థులు అడుగు వెనక్కేయడం లేదు. దీంతో క్షణక్షణానికి అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.