: నేడు మహిళా ఎమ్మెల్యేలతో తెలంగాణ మహిళా భద్రత కమిషన్ భేటీ
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం రూపొందించనున్న చట్టంపై నేడు తెలంగాణ మహిళా భద్రత కమిషన్, శాసన సభలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలతోె సమావేశం కానుంది. ఈ మేరకు సమావేశానికి హాజరుకావాలని భద్రత కమిషన్ అధికారి పూనం మాలకొండయ్య ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ఏఏ అంశాలను చట్టంలో పొందుపరచాలన్న విషయంపై అన్ని పార్టీల అభిప్రాయాలను కమిషన్ సేకరించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలతో పాటు, పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్న కమిషన్ ముసాయిదాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ చట్టం అమలులోకి వస్తే, తెలంగాణలో మహిళలను కన్నెత్తి చూడటానికి కూడా మగాళ్లు భయపడక తప్పదని గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.