: జపాన్ లో ఆర్థిక మాంద్యం
అభివృద్ధి చెందిన దేశంగా పేరున్న జపాన్ లో ఎవరూ ఉహించని విధంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. గడచిన మూడో త్రైమాసికంలో (జూలై - సెప్టెంబర్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.6 శాతానికి దిగజారింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ లో వాస్తవానికి మూడో త్రైమాసికంలో జీడీపీ 2.1 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ఆ దేశ ప్రధాని షింజో అబే వ్యాఖ్యానించారు. గణాంకాలను పూర్తిగా పరిశీలించిన మీదట తదుపరి చర్యల గురించి ఆలోచిస్తానని ఆయన అన్నారు. కాగా దేశంలో అమ్మకపు పన్నులను పెంచాలన్న నిర్ణయాన్ని ఆయన వాయిదా వేసుకోక తప్పదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.