: సిడ్నీ చేరిన మోదీ ఎక్స్ ప్రెస్!


ఆస్ట్రేలియాలో మోదీ ఎక్స్ ప్రెస్... మెల్ బోర్న్ నగరం నుంచి సిడ్నీ చేరుకుంది. సిడ్నీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు మెల్ బోర్న్ లోని ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా మోదీ ఎక్స్ ప్రెస్ ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియలో తొలిసారిగా ఓ వ్యక్తి పేరిట పరుగులు పెట్టిన ఈ రైలును ఆస్ట్రేలియా మంత్రి మాథ్యూ గై ఆదివారం జెండా ఊపి ప్రారంభిచారు. 220 మంది ప్రవాస భారతీయులు ఈ ప్రత్యేక రైలులో మెల్ బోర్న్ నుంచి సిడ్నీ చేరుకున్నారు. మోదీ పేరిట ఏర్పాటైన ఈ రైలులో ప్రయాణించిన వారికి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన సంప్రదాయక వంటకాలతో ఉచితంగా రుచికర భోజనాన్ని నిర్వాహకులు అందించారు.

  • Loading...

More Telugu News