: తిరుమలలో తగ్గిన రద్దీ


తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. పెరిగిన చలి తీవ్రత, వర్షాలు పడుతుండటం కారణాలతో భక్తుల రాక మందగించింది. దీంతో సర్వ, ప్రత్యేక దర్శనాలకు గరిష్టంగా 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. నడకదారి భక్తులకు ఆదివారం నాడు దర్శనం రద్దు చేసినట్టు టీటీడీ పేర్కొంది. ఇదిలాఉండగా, ఉచిత, రూ. 100, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 10 ఖాళీగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News