: తెలంగాణ సభలో వాయిదా తీర్మానాలు


తెలంగాణ శాసన సభ సమావేశాల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్, బీజేపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. పార్టీ ఫిరాయింపుల చట్టంపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని కోరగా, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని బీజేపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేఫథ్యంలో నేటి సభలో గందరగోళం నెలకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అంతేకాక టీఆర్ఎస్ ఆకర్ష్ కు అడ్డుకట్ట వేసేందుకు ఆ పార్టీ తన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టే అవకాశముంది.

  • Loading...

More Telugu News