: హైదరాబాద్-బ్రిస్ బేన్ ల మధ్య సోదర బంధం: మోదీ


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ ల మధ్య సోదర బంధముందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ-20 సదస్సు కోసం మూడు రోజులుగా ఆయన బ్రిస్ బేన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీతో పాటు జీ-20 సదస్సు కోసం తమ నగరానికి వచ్చిన పలు దేశాధినేతలకు బ్రిస్ బేన్ యేమర్ ఆదివారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ...హైదరాబాద్, బ్రిస్ బేన్ ల మధ్య సోదర బంధాన్ని ప్రస్తావించారు. ‘అడ్వాన్స్ డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్ బేన్ అవతరిస్తే, హైదరాబాద్ సైబరాబాద్ గా పేరొందింది. సహజంగానే ఈ రెండు నగరాల మధ్య సోదర బంధం ఏర్పడనుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడాలంటే, ఇరు దేశాల్లోని రాష్ట్రాలు, నగరాలు ఇంకా దగ్గరకావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News