: నేడు సిడ్నీలో మోదీ బహిరంగ సభ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో బహిరంగ సభను నిర్వహించనునున్నారు. జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వచ్చిన మోదీ, నేడు సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి. బ్రిస్ బేన్ నుంచి ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే సిడ్నీ చేరుకున్నారు. మోదీ బహిరంగ సభకు 16 వేల మంది భారతీయులు హాజరుకానున్నారని అధికారిక సమాచారముండగా, ఇప్పటికే అంతకుమించి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నగరం న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ లో జరిగిన సభలాగే ఈ సభ కూడా రికార్డులను సృష్టించనుంది.