: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ డీప్యూటీ సీఎం అలీ పీఏకు తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) జాన్ వెస్లీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాన్ వెస్లీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స కోసం ఆయనను హుటాహుటీన హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది.