: అంగారక యాత్రకు ఔత్సాహికుల ఆత్రుత
అయిదేళ్ల తర్వాత అంగారక గ్రహం మీదికి మనుషుల్ని పంపాలనే ఆలోచన ప్రస్తుతం శాస్త్రవేత్తలకు ఉంది. ఈ యాత్ర 501 రోజుల పాటూ సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇన్‌స్పిరేషన్ మార్స్ ఫౌండేషన్, పారగాన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లు కలసి ఈ యాత్రను నిర్వహించబోతున్నాయి. అంగారక గ్రహం మీదికి మనుషుల్ని పంపాలా? వద్దా? అన్న విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు గానీ.. మేం వెళ్తాం అంటే మేం వెళ్తాం అంటూ.. ఉత్సాహం చూపిస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. 2018లో ప్లాన్ చేస్తున్న ఈ యాత్రకోసం అనేక మంది దరఖాస్తు చేసుకుంటున్నారట. ఈ పోకడపై పారగన్ సంస్థ అధ్యక్షుడు జేన్ పాయింటర్ మాట్లాడుతూ.. ఇంకా ఎవరినుంచీ అప్లికేషన్లు ఆహ్వానించలేదని చెప్పారు.