: స్పెయిన్ పర్యటనలో వెంకయ్యనాయుడు


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం రాత్రి స్పెయిన్ పర్యటనకు బయలుదేరివెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్న మంత్రి, బుధవారం రాత్రి తిరిగి ఢిల్లీ బయలుదేరతారు. సోమ, మంగళ, బుధవారాల్లో స్పెయిన్ నగరం బార్సిలోనాలో జరగనున్న ‘స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్’ సదస్సులో ముఖ్య అతిథి హోదాలో పాల్గొంటారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో వెంకయ్యనాయుడు తన పర్యటనలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News