: నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన...బిజీబిజీగా గడపనున్న ఏపీ సీఎం


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న సీఎం రాత్రి దాకా నిర్విరామంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సీఎం పర్యటన రాత్రి 8.30 గంటల దాకా కొనసాగనుంది. 11 గంటలకు నగరంలోని ఎంవీపీ కాలనీలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంలకు కైలాసగిరి చేరుకుని కార్తీక వన మహోత్సవాల్లో పాలుపంచుకుంటారు. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే గడపనున్న చంద్రబాబు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లో తుపాను నష్టాలు, పరిహారం పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. సాయంత్రం 5.30 గంటలకు గురజాడ కళాక్షేత్రంలో క్రిస్టియన్ సంఘాలు ఏర్పాటు చేసిన 'థ్యాంక్స్ గివింగ్' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆర్ కే బీచ్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘రిజువనేషన్ విశాఖ’ కార్యక్రమానికి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు. 6.40 గంటలకు వుడా పార్కులో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బందికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే వారితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేసి రాత్రి 8.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

  • Loading...

More Telugu News