: తెలుగు రాష్ట్రాల ఆలయాలకు పోటెత్తిన భక్త జనం
కార్తీక మాసంలో చివర సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. నదుల్లో పుణ్య స్నానాలు చేసిన భక్తులు, అనంతరం ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు శ్రీశైలం, బాసర, తదితర ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.