: మల్లన్న సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య
శ్రీశైల మల్లికార్జున స్వామిని సోమవారం ఉదయం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య దర్శించుకున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని రాజయ్య మల్లన్నను దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలోనే తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న రాజయ్య, సోమవారం కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం చేరుకుని మల్లన్న సేవలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.