: కెప్టెన్ల ఇద్దరి వ్యక్తిగత స్కోరు 139, నాటౌట్!
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఓ అరుదైన విషయం చోటుచేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లు తమ బ్యాట్లను ఝుళిపించేశారు. అంతేకాదు, ఇద్దరూ సాధించిన వ్యక్తిగత స్కోరు కాకతాళీయంగా ఒకటే! ఇద్దరూ నాటౌట్ గా నిలవడం మరో విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 286 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ మాథ్యూస్ 139 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోరి దిగిన టీమిండియా తరపున కెప్టెన్ కోహ్లీ కూడా సరిగ్గా మాథ్యూస్ లాగా 139 పరుగులు సాధించాడు. అతడిలాగే చివరి దాకా క్రీజులో నిలిచిన కోహ్లీ నాటౌట్ గా నిలవడం గమనార్హం!