: 'లక్ష్మీ రావే మా ఇంటికి' ఆడియో వేడుక షురూ
హైదరాబాదులో 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమా ఆడియో వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అవసరాల శ్రీనివాస్, కల్యాణిమాలిక్, ఇలియానా, నరేశ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, అవికా గోర్ హీరో హీరోయిన్లు. నంద్యాల రవి దర్శకుడు. కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. షాయాజీ షిండే, అలీ, రావు రమేశ్, ప్రగతి, 'సత్యం' రాజేశ్ తదితరులు ఇతర తారాగణం. కుటుంబ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.