: ముస్లింలు అమెరికాను కొలంబస్ కన్నా ముందే కనుగొన్నారు: టర్కీ అధ్యక్షుడు
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లిం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం నావికులు అమెరికాను కొలంబస్ కన్నా ముందే కనుగొన్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం నావికులు 1178లో అమెరికా చేరుకున్నారని పేర్కొన్నారు. అమెరికాను కనుగొనే క్రమంలో తాను క్యూబాలోని ఓ కొండపై మసీదును చూసినట్టు కొలంబస్ డైరీలో రాసుకున్నాడని ఎర్డోగాన్ తెలిపారు. కాగా, కొలంబస్ అమెరికాను కనుగొన్నది 1492లో అని పెక్కుమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1996లో ప్రచురితమైన ఓ వివాదాస్పద వ్యాసంలో యూసఫ్ ఎమ్రోహ్ అనే చరిత్రకారుడు, ముస్లింలే అమెరికాను కనుగొన్నారన్న దానికి కొలంబస్ డైరీయే సాక్ష్యమని అన్నారు.