: చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ కు చంద్రబాబు అభినందనలు
చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా అవతరించి, ఈ టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లోకెక్కిన తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాంత్ లాంటి క్రీడాకారులు దేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ చైనా టాప్ షట్లర్ లిన్ డాన్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.