: వైద్యం కోసం గిరిజనుల సాహసం


దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల లేమికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లా పాలగూడ నుంచి ఓ వ్యక్తిని ఇతర ఆదివాసీలు వైద్యం కోసం సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని చర్లకు మోసుకుపోయారు. విషయం ఏమిటంటే... దండకారణ్యంలో జోగా అనే ఆదివాసీ జ్వరంతో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలోకి జారుకున్నాడు. దీంతో, అతడిని మంచంలోకి చేర్చి చర్లకు మోసుకువచ్చారు. 24 గంటలకు పైగా సాగిందీ ప్రయాణం. శనివారం ఉదయం పాలగూడ నుంచి బయల్దేరిన ఆదివాసీలు ఆదివారం ఉదయానికి చర్ల చేరుకున్నారు.

  • Loading...

More Telugu News