: నాగార్జున వర్శిటీలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరులో జరగనున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమావేశాలకు వేదిక కానుంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రేపు వర్శిటీని సందర్శించనున్నారు. క్యాంపస్ లోని డైక్ మన్ హాలును ఆయన అధికారులతో కలిసి పరిశీలిస్తారు. శీతాకాల సమావేశాలు ఈ నెలాఖరు నుంచి కానీ, డిసెంబర్ మొదటి వారం నుంచి కానీ జరగనున్నాయి.