: బ్రిస్బేన్ లో గాంధీ విగ్రహావిష్కరణకు మోదీ హాజరు
ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో ఆదివారం జరిగిన మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలకు గౌరవమిస్తున్న బ్రిస్బేన్ నగర మేయర్ ను అభినందించారు. గాంధీ సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమేనని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తాను గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తున్నానని చెప్పారు. గాంధీ జయంతి అక్టోబర్ 2న ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. ప్రకృతిని గాందీజీ ఎంతగానో ఆరాధించేవారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు ప్రధాన సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి కాగా, ఉగ్రవాదం రెండోదని ఆయన చెప్పారు