: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్
చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 35వ ర్యాంకర్ అకెన్ యమగుచి (జపాన్)ను మట్టి కరిపించి సైనా నెహ్వాల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు, శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో చైనా క్రీడాకారిణిని ఓడించి ఫైనల్లో ప్రవేశించిన సైనా, తన జైత్రయాత్రను కొనసాగించి టైటిల్ కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా కనీసం ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది. ఆరోసారి టోర్నీలో తన సత్తా చాటిన ఈ హైదరాబాదీ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించడంతో పాటు విజేతగానూ నిలిచింది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ లోనూ హైదరాబాదీ షట్లర్ శ్రీకాంత్ కూడా ఫైనల్స్ కు చేరుకున్నాడు. తను కూడా ఈ రోజే ఫైనల్ ఆడనున్నాడు.