: 2022 నాటికి దేశంలోనే ఏపీకి అగ్రస్థానం: చంద్రబాబు
2022 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మనకంటే తక్కువ జనాభా కలిగిన సింగపూర్ మనకంటే నాలుగు రెట్లు అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సింగపూర్ లో జరిగిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. సింగపూర్ లో తన పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతివారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2012 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతానని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.