: ఢిల్లీ ప్రగతి మైదాన్ స్థాయికి ఎగ్జిబిషన్ సొసైటీ ఎదగాలి: కేసీఆర్
హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ, ఢిల్లీ ప్రగతి మైదాన్ స్థాయికి ఎదగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం ఎగ్జిబిషన్ సొసైటీ, తార్నాకలో ఏర్పాటు చేసిన ఫార్మసీ కళాశాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సొసైటీ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. నిబద్ధత గల వ్యక్తుల కారణంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ దినదినప్రవర్ధమానంగా ఎదుగుతోందన్నారు.