: మోదీ... మా టార్గెట్: పాక్ తాలిబన్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీయే తమ లక్ష్యమని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని ప్రకటించిన తాలిబన్లు, పాక్ తో పాటు భారత్ కూడా తమ లక్ష్యాల జాబితాలో ఉందని ప్రకటించారు. ఇటీవలి కాలంలో పాక్ లో తమ ఉనికి కోల్పోయిన తాలిబన్లు తిరిగి తమ ఉనికిని చాటుకునేందుకే వాఘా దాడికి పాల్పడ్డారని తాలిబన్ వేర్పాటువాద సంస్థ 'తెహ్రీక్-ఏ- అహ్రార్' ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక వాఘా సరిహద్దు వద్ద దాడికి పాల్పడ్డ తాలిబన్ ఉగ్రవాది ఫొటోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. మోదీని లక్ష్యంగా చేసుకున్నామన్న తాలిబన్ల తాజా ప్రకటనను భారత నిఘా వర్గాలు కూడా నిర్ధారించాయి.