: కండ్రిగలో ముగిసిన సచిన్ పర్యటన


నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పర్యటన ముగిసింది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దత్తత తీసుకున్న కండ్రిగలో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన రెండు గంటల్లో తన పర్యటనను ముగించుకుని చెన్నై బయలుదేరి వెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన సచిన్, కండ్రిగ వాసులతో ముఖాముఖి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతోనూ మాట్లాడారు. గ్రామంలోని కొన్ని ఇళ్ల వద్దకు వెళ్లిన సచిన్, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు. అనంతరం గ్రామ యువతతో సరదాగా కాసేపు క్రికెట్ కూడా ఆడారు. సచిన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులతో ముఖాముఖీ సందర్భంగా తెలుగులోనే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సచిన్ వెంట ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించారు.

  • Loading...

More Telugu News