: హైదరాబాదు లో కుక్కల స్వైరవిహారం...రేబిస్ వ్యాధితో ఆర్టీసీ ఉద్యోగి మృతి
హైదరాబాద్ మహా నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ప్రజలపై దాడులు చేస్తున్న కుక్కలను అరికట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, రేబిస్ వ్యాధి బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగి శివరాజు ఆదివారం మరణించారు. రేబిస్ వ్యాధి సోకిన నేపథ్యంలో శివరాజు పడిన నరకయాతన అతడి కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి, పిచ్చి కుక్కలను నిర్మూలించాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.