: పాలకొల్లులో 'సేవ్ గర్ల్' పేరిట 2కే రన్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు
ఆడ శిశువులను కాపాడాలనే నినాదంతో పాలకొల్లులో ఆదివారం ‘సేవ్ గర్ల్’ పేరిట 2కే రన్ జరిగింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాలుపంచుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలను కూడా నివారించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.