: పుట్టంరాజువారి కండ్రిగలో వంద ఇళ్లు... 600 జనాభా!
భారతరత్న సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఉన్న ఇళ్ల సంఖ్య కేవలం వంద మాత్రమే. జనాభా కూడా 600లకు మించదు. ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకున్న సచిన్, ఏడాదిలో దాదాపుగా రూ.3.5 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేబడతారు. గ్రామానికి చేరుకున్న సచిన్, గ్రామస్థులతో నేరుగా భేటీ అవుతున్నారు. అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న విషయంపై ఆయన, గ్రామస్థుల అభిప్రాయాలకే ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గ్రామస్థులతో చర్చిస్తున్నారు.