: కండ్రిగ యువతతో సచిన్ సరదా క్రికెట్ మ్యాచ్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోమారు క్రికెట్ మైదానంలోకి దిగుతున్నారు. అదేంటీ, ఆయన రిటైర్ మెంట్ ప్రకటించేశారనేగా మీ సందేహం. నిజమైన మ్యాచ్ కాదులెండి. పుట్టంరాజువారి కండ్రిగ పర్యటనలో భాగంగా గ్రామ యువతతో ఆయన సరదా మ్యాచ్ ఆడేందుకు అంగీకరించారట. ఇందుకోసం పిచ్ కూడా సిద్ధమైంది. సచిన్ తో సరదా క్రికెట్ ఆడే అవకాశం రావడంతో గ్రామ యువత ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి కండ్రిగకు బయలుదేరిన ఆయన మరికొద్ది సేపట్లో గ్రామానికి చేరుకోనున్నారు. గ్రామంలో మధ్యాహ్నం 1 గంట దాకా పర్యటించే సచిన్, గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతారని సమాచారం. దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.